KTR: ఉచిత విద్యుత్‌ రద్దు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌ది.. గతంలోనూ రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది

KTR: కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం వ్యతిరేకించాలి

Update: 2023-07-11 07:01 GMT

KTR: ఉచిత విద్యుత్‌ రద్దు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌ది.. గతంలోనూ రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది

KTR: ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని తెలిపింది. ఉచిత విద్యుత్‌ రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌దని.. గతంలోనూ రైతులను గోస పెట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్‌కే ఉందన్నారు మంత్రి కేటీఆర్. మరోసారి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను బయటపెట్టిందన్న కేటీఆర్.... కాంగ్రెస్ తీరును తెలంగాణ సమాజం వ్యతిరేకించాలన్నారు.

Tags:    

Similar News