Eatala Rajendar: చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 50లక్షల ఆర్థిక సాయం చేయాలి
Eatala Rajendar: పంట నష్టపోయిన రైతాంగానికి సాయం చేయాలి
Eatala Rajendar
Eatala Rajendar: వరదల్లో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 50లక్షల ఆర్థిక సాయం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. కోతకు గురైన చెరువులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలన్నారు. కొట్టుకుపోయిన పంటకే కాకుండా.. నీటిలో నానిన పంటకు సైతం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని తెలిపారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటోందన్నారు ఈటల రాజేందర్ .