Hyderabad: లండన్‌లో తెలుగు యువతి హత్య.. చంపేసిన బ్రెజిల్‌ యువకుడు

Hyderabad: కత్తితో దాడి చేసిన బ్రెజిల్ యువకుడు

Update: 2023-06-14 07:18 GMT

Hyderabad: లండన్‌లో తెలుగు యువతి హత్య.. చంపేసిన బ్రెజిల్‌ యువకుడు

Hyderabad: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని లండన్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది.ఈ క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా.. తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా తండ్రి అనారోగ్యానికి గురవ్వగా ఆరు నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్లింది. మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి చేసి ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తన కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తేజస్వినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News