Cyber Crime: సైబర్‌ వలలో తెలంగాణ విలవిల

Cyber Crime: సైబర్‌ క్రైంరేట్‌లో దేశంలో తెలంగాణ సెకండ్‌ ప్లేస్‌ * సైబర్‌ క్రైం ప్రభావిత రాష్ట్రాలపై ‘సైబర్‌సేఫ్‌’ వెబ్‌సైట్‌ నివేదిక

Update: 2021-07-25 09:42 GMT
Representational Image

Cyber Crime: సైబర్ నేరగాళ్ల వలలో తెలంగాణ విలవిలలాడుతోంది. సైబర్ కేఫ్ గణంకాలు తెలంగాణ ప్రజలను వణికిస్తున్నాయి. సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌ సెకండ్‌లో ఉంది. దేశవ్యాప్తంగా నేరగాళ్లు కొల్లగొట్టిన నగదులో 40 శాతం తెలంగాణ నుంచే లూటీ చేశారు. సైబర్ నేరగాళ్లు తెలంగాణను ఎందుకు టార్గెట్‌ చేశారు. చదువుకున్న వాళ్లు సైతం ఎలా మోసపోతున్నారు.

తెలంగాణలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఎంతో మంది నిరుద్యోగులుగా మారారు. ఇదే అదునుగా భావించిన నేరగాళ్లు లేనిపోని ఆశలు పెంచి, కోలుకోని దెబ్బకొడుతున్నారు. ఇందుకోసం క్రెడిట్‌ కార్డు లిమిట్‌ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. ఇక్కడ ట్విస్ట్‌ ఎంటంటే.. పీజీలు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు సైతం సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. సైబర్‌ ఫ్రాడ్స్‌పై బ్యాంకులు అవగాహన కల్పిస్తున్నా.. చైతన్యపర్చించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా.. జరగాల్సిన తంతూ జరిగిపోతోంది.

తెలంగాణను సైబర్‌ నేరాలు టార్గెట్‌ చేశారు. 2018 ఆగస్టు1 నుంచి 2021 జూన్‌ 1 వరకు దేశవ్యాప్తంగా 66వేల 9వందల5 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 79.68 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే 'సైబర్‌సేఫ్‌' వెబ్‌సైట్‌ నివేదిక స్పష్టం చేసింది.

సైబర్‌ నేరగాళ్లు భారీగా డబ్బు కొల్లగొట్టిన టాప్‌–5 రాష్ట్రాలను సైబర్‌ సేఫ్‌ వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 29కోట్ల 21లక్షల 80వేల రూపాయాలు కాజేశారు. ఇక తెలంగాణలో 19కోట్ల 96లక్షలను కొట్టేశారు. తర్వాత తమిళనాడు, హర్యానా, బిహార్ రాష్ట్రాల్లో సైబర్‌ నేరగాళ్లు తమ టాలెంట్‌ ప్రదర్శిస్తున్నారు. దేశం మొత్తంలో సైబర్‌ నేరగాళ్లు 80కోట్లు కొట్టేశారు. ఇందులో 40శాతం మన తెలంగాణ నుంచే ఉంది.

ఉచిత పథకాలు, బహుమతులు, ఫ్రీ బ్యాలెన్స్ అంటూ వచ్చే ఆఫర్లకు టెమ్టైయి సైబర్‌నేరగాళ్లకు బుక్కవుతున్నారు. ఈ సమాజంలో ఏదీ ఊరికే రాదు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని దొంగల పాలకు చేయకండని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News