TS TET Results: తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకోండి

Update: 2025-02-05 12:19 GMT

Telangana TET Results 2024-II: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. జనవరి 2 నుండి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన తరువాత 2 వారాల వ్యవధిలోనే పాఠశాల విద్యా శాఖ ఈ ఫలితాలు వెల్లడించింది.

1,35,802 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవగా అందులో 42,384 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 

ఫలితాలు చెక్ చేసుకోవడం కోసం tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.in వెబ్‌సైట్స్‌లోకి లాగాన్ అవండి. 

Tags:    

Similar News