Telangana: సుధీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్‌ భేటీ

Telangana: పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

Update: 2022-01-18 00:51 GMT

సుధీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్‌ భేటీ

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుధీర్ఘంగా సాగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినెట్ మొదటగా చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా కేబినేట్‌కు వివరించారు. అనంతరం రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై చర్చించారు.

తెలంగాణ కేబినెట్‌ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రభుత్వ ఉచిత విద్యా బలోపేతానికి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కోసం 7వేల 289 కోట్ల ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటి ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News