మే 9 వరకు పాలిసెట్‌.. మే 5 వరకు ఎంసెట్ దరఖాస్తుల గడువు

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Update: 2020-04-30 06:55 GMT

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. అంతే కాదు ప్రవేశపరీక్షల దరఖాస్తుల తేదీలను కూడా ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి పాలిసెట్ 2020 దరఖాస్తుల తేదీని పొడిగించింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పాలిసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి దరఖాస్తుల తేదీని మే 9 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి మూర్తి ప్రకటించారు.

అదే విధంగా (ఎల్పీసెట్‌) లాటరల్‌ ఎంట్రి ఇన్‌ టూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దరఖాస్తుల గడువును కూడా మే 11 వరకు పొడిగించామని స్పష్టం చేసారు. ఇక తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ఎంసెట్ దరఖాస్తుల తేదీ పొడిగించడంతో బుధవారం వరకు 1,92,162 దరఖాస్తులు వచ్చాయని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన మరికొంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే ఐదు వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉన్నదని వెల్లడించారు.


Tags:    

Similar News