Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. దేనికోసమంటే..!
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందంటూ హెచ్చరిక
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. దేనికోసమంటే..!
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమి పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించినా.. వారి వెతలు తీరలేదన్నారు. క్రమబద్ధీకరణ జరగకపోగా, జీతాలివ్వండి మహాప్రభో అని అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో జీతాలు చెల్లించని ప్రక్షంలో.. వారి తరపున కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు సైతం సిద్ధమవుతుందని రేవంత్‌రెడ్డి లేఖలో హెచ్చరించారు.