రెండోరోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కొనసాగుతోంది.

Update: 2025-11-07 06:31 GMT

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలోని స్పీకర్‌ ఆఫీస్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇప్పటికే తొలివిడతలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారించారు.

ఇప్పడు రెండోవిడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారణకు స్వీకరించారు. నిన్న స్పీకర్‌ విచారణకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్‌ సంజయ్‌ హాజరుకాగా.. ఇవాళ పోచారం, అరికెపూడిని స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇక.. ఈ నెల 12న తెల్లం వెంకట్రావు, సంజయ్‌ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగనుంది. 13న పోచారం, అరికెపూడి గాంధీలను మరోసారి విచారించనున్నారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్. 

Tags:    

Similar News