Malla Reddy: త్వరలో స్టూడియో కడతా... ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెడతా
Malla Reddy: సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు బంగారు గని
Malla Reddy: త్వరలో స్టూడియో కడతా... ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పెడతా
Malla Reddy: సంచలన వ్యాఖ్యలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయ్. మేడే సందర్భంగా సినీ కార్మిక మహోత్సవంలో పాల్గొన్న మల్లారెడ్డి కరోనా కష్టకాలం పోయిందని వచ్చే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ మరిన్ని సంచలనాలు నమోదు చేస్తుందన్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ పెట్టి సినిమాలు తీయడంతోపాటు స్టూడియోలు కడుతానన్నారు మల్లారెడ్డి.
ప్రపంచమంతా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని అన్నారు. చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కారని సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లేనన్నారు. నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీ లు పెట్టుకోవాలని మల్లారెడ్డి ఇండస్ట్రీ పెద్దలను కోరారు. కార్మికుల పక్షాన చిరంజీవి నిలబడాలని కార్మికులకు ధనవంతులను చేసే బాధ్యతను చిరంజీవి తీసుకోవాలన్నారు.