KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ.. వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌..

KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

Update: 2021-06-21 01:15 GMT

కేటీఆర్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. వ్యాక్సిన్ క్యాపిటల్ హైదరాబాద్‌లో టెస్టింగ్ సెంటర్ అత్యవసరమని వివరించారు. కసౌళి జాతీయ సెంటర్‌కు పంపుతుంటే 45 రోజులు ఆలస్యమవుతోందని.. టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుతో 10 కోట్ల అదనపు డోసులు ఉత్పత్తి చేయొచ్చని లేఖలో తెలిపారు. టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే హైద‌రాబాద్‌లో సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూమిని జీనోమ్ వ్యాలీలో అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News