Karimnagar: ముందు ఉద్యోగాలివ్వండి.. ఆ తర్వాతే మూసీ, హైడ్రా!

Karimnagar: తెలంగాణ అసెంబ్లీలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై సీఎం ప్రకటించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి డిమాండ్ చేశారు.

Update: 2026-03-25 10:42 GMT

Karimnagar: ముందు ఉద్యోగాలివ్వండి.. ఆ తర్వాతే మూసీ, హైడ్రా!

Karimnagar: రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై చర్చించి ఉద్యోగాల భర్తీకై అసెంబ్లీలో సీఎం ప్రకటించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా నాడు తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకే వస్తాయని 1236 మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకొని సాధిస్తే నేడు పాలకులు ఉద్యోగాల గురించి చర్చించకుండా వారి వ్యక్తిగత సమస్యలపై చర్చించుకుని సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలకై సీఎం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రణాళిక చేయాలి..

ఆత్మబలిదారుల మీద స్వరాష్ట్రం సాధిస్తే గత పాలకులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి ఇంట్లో ఉద్యోగాలు భర్తీ చేసుకొని ఫామ్ హౌస్ లు నిర్మించుకొని వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు కానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అధికార పక్షము మూసి హైడ్రా మెట్రో విస్తరి కరణ చేస్తామనడం చాలా సంతోషకరం, కానీ నిరుద్యోగ యువతపై ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

స్వరాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కరువు..

స్వరాష్ట్రం సాధించుకుంటే ఇంటికొక ఉద్యోగం వస్తాయని నాడు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అధికార పక్షం పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ ప్రకటించకపోతే ఈనెల 26న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా యువత ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News