Karimnagar: అపర భద్రాద్రిలో అగచాట్లు.. అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం!
Karimnagar: ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాల వేళ భక్తుల ఇబ్బందులు. అధ్వాన్నంగా మారిన సిరిసేడు - ఇల్లంతకుంట రోడ్డు.
Karimnagar: అపర భద్రాద్రిలో అగచాట్లు.. అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం!
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం మొదలవుతున్నాయి దీని ఆనుకొని ఉన్న సిరిసేడు గ్రామానికి నుండి మెయిన్ రోడ్డు నుంచి వచ్చే రోడ్డు పూర్తిగా దెబ్బతిని డ్యామేజ్ కావడంతో వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందికరంగా మారినది.
ఆయన పాలకులు కానీ అధికారులు కాని నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు వెయ్యలాది మంది భక్తులతో తరలివస్తారు ఎక్కడి నుంచో వరంగల్ నుండి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అమెరికా నుండి కూడా వచ్చే ఈ అపరాధి భద్రాది పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇల్లతకుంట అంత పేరు ఉన్న దేవుని మీద నమ్మకంతో ఎక్కడినుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేక వాహనాలు నిలబడానికి కూడా స్థలాలు లేక వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందికరంగా మారింది.
రోడ్డు డ్రైనేజీ పరిస్థితి చూస్తే రోడ్డు మీదనే డ్రైనేజీ నీరు రావడంతో భక్తులు ఆ మురికి నీళ్లలో తొక్కుకుంటూ రావడం జరుగుతుంది వాహనాలు ఎప్పుడు కింద గుంతలో పడతాయో తెలివియాని పరిస్థితి కానీ రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా ఈ పాలకవర్గం కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని పట్టించుకోని ఈ రోడ్డును శ్రీ సీతారామచంద్రస్వామి తలంబ్రలు మొదలవుతున్నాయి.
త్వరలో పూర్తి చేయాలని భక్తులు గ్రామస్తులు వాహనదారులు వేడుకుంటున్నారు ఆలయ అధికారులు అక్కడిక్కడే ఎంతో చేసినట్టు హడావుడి చేస్తున్నారు తప్ప ఈ వచ్చిపోయే వాహనదారుల గురించి భక్తుల గురించి లేదని ఇవ్వబోతున్నారు ఇప్పటికైనా స్పందించి త్వరలో రోడ్డు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.