Job Calendar: నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
Job Calendar: తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు.
Job Calendar: నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
Job Calendar: తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు. ఆ మేరకు నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌కి ఆమోదం తెలిపిన కేబినెట్... నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. మరోవైపు నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఎనిమిది రోజుల పాటు హాట్ హాట్‌గా సమావేశాలు సాగాయి. చివరి రోజు కావడంతో మరింత హీట్‌గా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. నేటి సభలో జాబ్ క్యాలెండర్‌తో పాటు ధరణి, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరగనుంది.