Corona Latest News: కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Corona Latest News: వ్యాక్సినేషన్ పురోగతిపై జిల్లా అధికారులకు ప్రతిరోజూ నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2021-09-05 04:06 GMT

కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Corona Latest News: కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ దిశగా సర్కార్ చర్యలు ప్రారంభిచింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 18 ఏళ్లు పై బడిన విద్యార్ధులందరికీ వందశాతం టీకాలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సెప్టెంబరు పదో తేదీని గడువుగా నిర్దేశించింది. ప్రతి విద్యాసంస్థలో బోధన, బోధనేతర సిబ్బంది, 18 ఏళ్లు పైబడిన విద్యార్ధులందరికీ టీకాలు పూర్తయితే వందశాతం వ్యాక్సినేటెడ్‌గా ప్రకటించాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు స్థానిక పీహెచ్‌సీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. అన్ని విద్యాసంస్థల్లో సెప్టెంబరు పదో తేదీ కల్లా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలిపింది. టీకాల ప్రక్రియను విద్యాసంస్థల ముఖ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వ్యాక్సినేషన్ పురోగతిపై జిల్లా అధికారులకు ప్రతిరోజూ నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News