Telangana: మరో 5 ప్రైవేటు ఆస్పత్రులపై వేటు..

Telangana: తెలంగాణలో కొవిడ్ చికిత్సకు సంబంధించి మరో 5 ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసింది.

Update: 2021-05-30 02:37 GMT

Private Hospitals In Telangana:(The Hans India)

Telangana: కరోనాతో ప్రాణాలతో పాటు ఆస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలవడం జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు ఆ రేంజ్ లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శుక్రవారం కొన్ని ఆసుపత్రలు అనుమతులు రద్దు చేయగా, శనివారం కూడా మరో 5 ఆసుపత్రల అనుమతులు రద్దు చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ మేరకు ప్రభుత్వం ఈ చ‌ర్యలు చేప‌ట్టింది. ఈ క్రమంలో తాజాగా 27 ఆసుప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తాజాగా అనుమతులు రద్దు చేసిన వాటిలో అమీర్‌పేట్ ఇమేజ్ ఆస్పత్రి, ఎల్‌బీ న‌గ‌ర్‌లోని అంకుర, కొండాపూర్‌లోని సియాలైఫ్‌, షాపూర్‌న‌గ‌ర్‌లోని సాయి సిద్ధార్థ, భూత్‌పూర్‌లోని పంచ‌వ‌టి ఆస్పత్రుల కొవిడ్ ట్రీట్ మెంట్ లైసెన్సును ర‌ద్దు చేశారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వం రాష్ట్రంలో 10 ఆస్పత్రుల లైసెన్సును ర‌ద్దు చేసిన‌ట్లు అయింది. ఇటీవ‌లే ఐదు హాస్పిటళ్ల అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసిన ప్రభుత్వం.. 64 ప్రైవేటు హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

శుక్రవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రితో పాటు బేగంపేటలోని విన్‌ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్‌ హెల్త్‌, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రుల కరోనా చికిత్సల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News