ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ తమిళిసై
* మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన గవర్నర్ * ఆదివాసుల కళలు, కళారూపాల గురించి అడిగి తెలుసుకున్న తమిళిసై
గవర్నర్ తమిళిసై (ఫోటో: ది హన్స్ ఇండియా)
Governor Tamilisai: హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఆద్యా కళా ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాల స్టాల్‌ను పరిశీలించారు. ఆదివాసుల జీవనం గురించి భవిష్యత్ తరాలకు అందజేసేలా ఆద్యా కళా ప్రదర్శన ఉపయోగపడుతుందని గవర్నర్ కొనియాడారు. ఆదివాసుల కళలు, కళారూపాలు భద్రపరచడం కోసం మ్యూజియం ఏర్పాటు కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈఎస్ఐ, రాజ్‌భవన్ సిబ్బంది సహకారంతో ట్రైబల్ ఏరియాలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహించినట్టు తెలిపారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించినట్టు తెలిపారు. రెండో డోస్ ఆదివాసులతో కలిసి వేసుకున్నట్టు గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.