Telangana: ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ

Update: 2021-01-31 02:27 GMT

Representational Image

తెలంగాణలో బయోమెట్రిక్ ద్వారా రేషన్ దుకాణదారులు సరుకులు అందజేసేవారు. అయితే ఇప్పుడు వేలిముద్ర విధానానికి తెలంగాణ సర్కార్‌ స్వస్తి పలికి ఓటీపి ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో లబ్దిదారులు ఆధార్ తో ఫోన్ నంబర్ ను అనుసంధానం చేయటం తప్పనిసరి కావటంతో మీసేవా సెంటర్ ల వద్ద జనాలు క్యూ కట్టారు.

తెలంగాణలో రేషన్ కార్డు నెంబర్ చెప్పి వేలిముద్ర వేయగానే డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సహా తదితర సరుకులు అందించేవారు. కానీ వేలిముద్ర విధానానికి తెలంగాణ ప్రభుత్వం వీడ్కోలు పలుకుతోంది. రేషన్ దుకాణాల వద్ద బయోమెట్రిక్ పద్ధతిని పూర్తిగా తీసేస్తుంది. దానికి బదులు ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి నుంచి ఈ పద్ధతి అమలులోకి తీసుకురానున్నారు. రేషన్ కార్డు నెంబర్ ని ఈపాస్ డివైస్ లో డీలర్ ఎంట్రీ చేయగానే వినియోగదారుని ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపి ఆధారంగా రేషన్ సరుకులు అందిస్తారు.

కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ విధానాన్ని నిలిపి వేశారు. దీంతో పాటు మోసాలకు తావు ఉండకూడదంటే ఓటీపి విధానమే బెటర్ అని నమ్ముతున్న పౌరసరఫరాల శాఖ ఈ ఓటీపి పద్దతిని పకడ్బందీగా అమలు పరిచేందుకు కసరత్తులు పూర్తి చేసింది.ఆధార్ కార్డు తో వినియోగదారుల మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలని ఒకవేళ మొబైల్ నెంబర్ ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కాకపోతే మీ సేవా లేదా ఈ సేవాకు వెళ్లి ఆధార్ కార్డు తో మొబైల్ నెంబర్ లింక్ అప్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. దీంతో మీ సేవా ,ఈ సేవా సెంటర్ల వద్ద లబ్దిదారులు ఆధార్ తో తమ మొబైల్ నంబర్లు లింక్ చేసుకోవటానికి క్యూ కట్టారు.

కొత్త విధానం అమలులోకి వస్తుండడంతో ఫిబ్రవరి నెల నుంచి ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే రేషన్ సరుకులు పొందే ఆస్కారం ఉంటుంది.గ్రేటర్ హైదరాబాద్ లో 30 శాతం మంది లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఇంకా ఆధార్ తో లింకు కాలేదని సమాచారం.అయితే ఇప్పటికే ప్రభుత్వం చాలా రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిచే అవకాశాలు లేవని సమాచారం.దీంతో తమ ఫోన్ నంబర్లను ఆధార్ కు అనుసంధానం చేసువటానికి జనాలు మీ సేవా సెంటర్ల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.వికారాబాద్ పట్టణంతో పాటు పరిగి లోమీ సేవా సెంటర్ల వద్ద మీ సేవా సెంటర్ల వద్ద జనాలు క్యూ కట్టారు.

Tags:    

Similar News