Hyderabad Metro: తెలంగాణాలో మెట్రో మార్గదర్శకాలు.. విడుదల చేసిన ప్రభుత్వం

Hyderabad Metro: అన్ లాక్ - 4లో భాగంగా కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా మరికొన్ని మార్గదర్శకాలు తెలంగాణా ప్రభుత్వం రూపొందించింది.

Update: 2020-09-03 16:21 GMT

Hyderabad Metro

Hyderabad Metro: అన్ లాక్ - 4లో భాగంగా కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా మరికొన్ని మార్గదర్శకాలు తెలంగాణా ప్రభుత్వం రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగంచుకోవాలని సూచించింది. దీనికి అనుకూలంగా ప్రయాణికులు కోవిద్ నిబందనలను అనుసరించాలని కోరారు.

అన్‌లాక్‌ 4.0లో భాగంగా కేంద్రం మెట్రో రైలు సేవలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రో కార్యకలాపాలు గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించబడతాయి. మొదటి దశ మెట్రో సేవలు సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్‌ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గ్) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి. (చదవండి: మెట్రో రీ ఓపెన్‌.. ఫైన్‌ల మోత)

ఇక మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్‌ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక వీటి రెవెన్యూ సేవలు కేవలం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక కంటైన్మెంట్‌ జోన్లలోని స్టేషన్‌లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లు మూసివేత కొనసాగుతుంది.

Tags:    

Similar News