రేషన్ కార్డుకు ధరఖాస్తు చేయలేదా? మరో ఛాన్స్ ఇచ్చిన సర్కార్

Update: 2025-01-21 10:12 GMT

 EKYC

రేషన్ కార్డులను జనవరి 26 నుంచి జారీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ సభల్లో అర్హుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. పాత కార్డుల విషయంలో కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

రేషన్ కార్డులకు సంబంధించి ఆదాయ సర్టిఫికెట్ అవసరం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారులు అడుగుతున్నారు. దీంతో రెవిన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. ఆదాయ సర్టిఫికెట్ల కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. రేషన్ కార్డుల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి 2 లక్షల ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర ఆదాయం ఉండాలి. గ్రామ సభల్లో అర్హుల జాబితాను చదివి వినిపిస్తారు. జనవరి 24 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈ గ్రామ సభల్లో రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులను ఎంపిక చేస్తారు.

రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో ధరఖాస్తులు స్వీకరించారు. ఈ ధరఖాస్తులను పరిశీలించి అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.పాత రేషన్ కార్డులను తొలగించబోమని ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గ్రామ సభల్లోనే నేరుగా కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రేషన్ కార్డుల కోసం ధరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది.

Tags:    

Similar News