నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్: ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ.. ఉత్కంఠ రేపుతున్న స్పీకర్ నిర్ణయం!

Danam Nagender: దానం నాగేందర్‌ పిటిషన్‌పై ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారణ జరపబోతున్నారు.

Update: 2026-01-30 05:20 GMT

Danam Nagender: దానం నాగేందర్‌ పిటిషన్‌పై ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారణ జరపబోతున్నారు. ఇప్పటికే ఏడుగురికి క్లిన్‌చిట్‌ ఇచ్చిన స్పీకర్‌.. వాళ్ళు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ఇక ఇప్పుడు దానం నాగేందర్‌ విషయంలో స్పీకర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారు..? విచారణలో దానం ఏం చెబుతారు అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. గెలచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు జరిగి బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ స్పీకర్‌ స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్‌ చర్యలకు తీసుకోవట్లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కోర్టు డెడ్‌లైన్‌ వార్నింగ్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారణ చేపట్టారు.

ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్‌.. వాళ్లు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్‌ సంజయ్‌ దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్పి ఉంది. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు ఇచ్చారు. దానం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలచి కాంగ్రెస్‌ బీ ఫామ్‌పై ఎంపీగా కంటెస్ట్‌ చేశారు. ఫిరాయింపు కేసులో ఈ అంశం కీలక ఆధారంగా మారింది. స్పీకర్‌ నోటీసులకు ఇప్పటివరకు దానం విచారణ ఇవ్వలేదు. కాకపోతే విచారణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. ఇంతలోనే సుప్రీం కోర్టు గడువు ముగించుకోవడంతో దానం నాగేందర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇక ఇవాళ ఆయనను విచారించబోతున్నారు. తను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని.. పదవుల కోసం తాను ఎక్కడికి పోలేదంటూ.. దానం చెప్తున్నారు.

Tags:    

Similar News