Medaram Jatara 2026: సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు.. లక్షలాది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం పుణ్యక్షేత్రం

Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం పూర్తైంది. చిలకలగుట్ట దగ్గర పూజల అనంతరం సమ్మక్క జనంలోకి వచ్చింది.

Update: 2026-01-30 05:26 GMT

Medaram Jatara 2026: మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం పూర్తైంది. చిలకలగుట్ట దగ్గర పూజల అనంతరం సమ్మక్క జనంలోకి వచ్చింది. భక్తుల జయజయధ్వానాలతో మేడారం గద్దెలపైకి చేరుకుంది. సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, లక్ష్మణ్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు గౌరవందనం చేశారు. డోలు వాయిద్యాలు, ఎదురకోళ్లతో భక్తులు సమ్మక్కకు స్వాగం పలికారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్ రాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకుంది. రేపటి వరకు మేడారం జాతర కొనసాగనుంది.

మేడారం జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం అయ్యింది. నిన్న వనదేవత సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరింది. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వచ్చారు. దారిపొడవునా అడుగడుగునా భక్తులు అమ్మవారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. వన దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోయారు. లక్షలాది మందితో మేడారం జనసంద్రోహం అయ్యింది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి ప్రతి సమ్మక్క ప్రతి రూపాన్ని తీసుకొచ్చేముందు..ములుగు జిల్లా ఎస్పీ ఏకే 47 తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. గద్దెపైకి చేరే వరకు పోలీసులు నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

జనవరి 28న పగిడిద్దె రాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెపైకి చేరగా..నిన్న సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. నేడు అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరూ గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 

Tags:    

Similar News