Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్‌కు సిట్ నోటీసులు, రేపు విచారణ
Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసి రేపు విచారణకు పిలవనున్నట్లు సమాచారం.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్‌కు సిట్ నోటీసులు, రేపు విచారణ
Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, అలాగే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్లను విచారించింది. వారి వాంగ్మూలాల ఆధారంగా తదుపరి దశగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సిట్ అధికారులు నేడు లేదా రేపు కేసీఆర్‌కు నోటీసులు అందజేసి, విచారణకు హాజరుకావాలని సూచించే అవకాశముంది. సమాచారం ప్రకారం, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి నోటీసులు ఇవ్వాలని సిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా జరగవని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సిట్ విచారణ అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.