సొంత గ్రామాలకు వెళ్లడానికి ఈ-పాస్

తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది వలస కూలీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండియారు.

Update: 2020-05-03 07:13 GMT
Representational Image

తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది వలస కూలీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండియారు. చేసుకోవడానికి పని లేక, ఉండడానికి నివాసం లేక వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ గ్రామాలకు తిరిగి వెల్లిపోదామని నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో రవాణా సౌకర్యం లేకపోవడంతో వారు ఎక్కడికీ వెల్లలేక చిక్కుకుపోయారు. ధైర్యం చేసి వారు రాష్ట్ర సరిహద్దులు దాటితే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ-పాస్ చూపించమని అడుగుతున్నారు. అది లేకుండా వెలితే వారిని సరిహద్దులు దాటనివ్వడంలేదు. వారి కష్టాలను చూసిన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఓ నిర్ణయానికొచ్చారు.

రాష్ట్రంలో చిక్కుకుపోయిన కూలీలకు ఈ పాస్ జారీ చేయాలనుకుంటున్నారు. తమ గ్రామాలకు వెల్లాలనుకే వారు వెంటనే ఈ-పాస్ (E-PASS) కోసం అప్లై చేసుకోవచ్చని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఈ పాస్ కావాలనుకునే వారు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పాస్ సైట్‌ (https://tsp.koopid.ai/epass)లోకి వెళ్లి చూడవచ్చని తెలిపారు. ఇది పోలీస్ స్టేషన్ ను వచ్చి అప్లై చేయాల్సిన అవసరం లేదని, ఈ-పాస్ సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తమ సమాచారాన్ని ఎంటర్ చెయ్యాలని కోరారు. అలా ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను పోలీస్ శాఖ అధికారులు పరిశీలించి ఈ-పాస్ జారీ చేస్తామని తెలిపారు. ఇక ఇంకెందు ఆలస్యం వెంటనే తమ గ్రామాలకు వెల్లాలనుకునే వారు ఈ పాస్ కోసం అప్లై చేసుకోండి.




 


Tags:    

Similar News