Siddipet: సిద్దిపేటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రంగదాంపల్లి అమరుల స్థూపం దగ్గర హరీష్‌రావు నివాళి..
Siddipet: తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగింది.
Siddipet: సిద్దిపేటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రంగదాంపల్లి అమరుల స్థూపం దగ్గర హరీష్‌రావు నివాళి..
Siddipet: సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్‌రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతుకుముందు సిద్ధిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి సాధించామన్నారు మంత్రి హరీష్‌రావు. తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసుకున్నామని.. మిషన్ భగీరథ ద్వారా 2.18 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు మంత్రి హరీష్‌రావు.