Kishan Reddy: గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం..
Kishan Reddy: తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి
Kishan Reddy: గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం..
Kishan Reddy: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తరుఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తొమ్మిదేళ్లలో ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో వివరించేందుకు హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.