Nano Banana trend: జెమినైలో నానో బనానా ఫొటో కోసం ఆశపడితే… రూ.70 వేలు పోయాయి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో ఓ వ్యక్తి బనానా ఫొటో ట్రెండ్‌లో భాగంగా తన ఫొటోను అప్‌లోడ్‌ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల వలన రూ.70,000 నష్టం ఎదుర్కొన్నాడు.

Update: 2025-09-14 01:53 GMT

Nano Banana trend: జెమినైలో నానో బనానా ఫొటో కోసం ఆశపడితే… రూ.70 వేలు పోయాయి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో ఓ వ్యక్తి బనానా ఫొటో ట్రెండ్‌లో భాగంగా తన ఫొటోను అప్‌లోడ్‌ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల వలన రూ.70,000 నష్టం ఎదుర్కొన్నాడు.

సామాజిక మాధ్యమాల్లో నానో బనానా ఫిల్టర్ లేదా 3D ఇమేజ్ ట్రెండ్ హల్‌చల్ కొనసాగుతుండటంతో, బొప్పాపూర్ వాసి కూడా తన ఫొటోను 3Dలో మార్చాలని ఆశించాడు. ఇందుకు సంబంధించిన ఇమేజ్ ఎడిటర్ యాప్ లింక్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, ఫొటోను అప్‌లోడ్‌ చేశాడు.

తక్కువ సమయానికే అతని బ్యాంక్ ఖాతాలోని రూ.70,000 మాయం కావడంతో అతను అవాక్కయ్యాడు. ఈ సంఘటన సైబర్ కేటుగాళ్ల పని అని గుర్తించి, వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసును నమోదు చేసి, సైబర్ నేరగాళ్లను గుర్తించడం కోసం దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలు ఈ తరహా యాప్‌లను ఇన్స్టాల్‌ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని, అక్రమ లింకులు, అప్రమత్తం లింకుల వల్ల నష్టం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News