TS Congress: ఇవాళ రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు..

TS Congress: గవర్నర్ తమిళిసైతో సమావేశం కానున్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం

Update: 2023-08-01 03:35 GMT

TS Congress: ఇవాళ రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. 

TS Congress: ఇవాళ తెలంగాణ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవనుంది. ముందుగా సీఎల్పీ కార్యాలయంలో భేటీ కానున్న ప్రతినిధుల బృందం అనంతరం రాజ్‌భవన్‌ వెళ్లనుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసైతో సమావేశం కానుంది. రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో నష్టపోయిన పరిస్థితులను గవర్నర్ కి వివరించనున్నారు కాంగ్రెస్ నేతలు.

Tags:    

Similar News