Telangana News: తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్‌ సక్సెస్‌

Telangana News: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ జాతీయ గీతాలాపన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.

Update: 2022-08-16 09:36 GMT

Telangana News: తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్‌ సక్సెస్‌

Telangana News: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ జాతీయ గీతాలాపన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అబిడ్స్‌లోని జీపీవో సర్కిల్ వద్ద సీఎం కేసీఆర్ సామూహిక జనగణమన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా ఎక్కడికక్కడే నిలబడి సామూహిక జనగణమన ఆలపించారు.

భారత స్వాతంత్ర్య వజోత్సవలో భాగంగా ఖమ్మంలో జాతీయ గీతాలాపన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయగీతాన్ని ఆలపించటానికి పట్టణ ప్రజలు, విద్యార్థులు, అధికారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కులమత వర్గ విభేదాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై గౌరవంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

సూర్యాపేట జిల్లాలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలు వేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన చేశారు. చీవ్వేంల మండల కేంద్రంలోని దురాజపల్లి చౌరస్తా వద్ద ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపన కార్యక్రమం చేశారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో దేశభక్తి ఉప్పొంగింది. మార్చాల గ్రామంలోని పాఠశాల విద్యార్ధులతో కలిసి గ్రామపెద్దలు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పూసాల రోడ్డు చౌరస్తాలో, మానవహారంగా ఏర్పడి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News