Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన చేరుకున్నారు. రేపు జరగనున్న ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన చేరుకున్నారు. రేపు జరగనున్న ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. బీజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అద్యక్షుడు, సీఈఓ,నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్డ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ కానున్నారు. అమెజాన్, కార్ల్స్ బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉంది.