CM KCR: అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందించిన సీఎం కేసీఆర్

CM KCR: జాతీయ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్న అల్లు అర్జున్

Update: 2023-08-27 02:12 GMT

CM KCR: అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా అభినందించిన సీఎం కేసీఆర్

CM KCR: తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు రావడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 69 ఏళ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. అలాగే పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమా బృందాలకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్‌కు తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. రెండు రోజుల క్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో తెలుగు సినిమాలకు మొత్తం పదకొండుకు పైగా అవార్డులు దక్కాయి.

Tags:    

Similar News