TS Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

* మధ్యాహ్నం 2గంటలకు సమావేశం * ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, హుజూరాబాద్, దళిత బంధు, నదీజలాలపై గెజిట్ విడుదలపై కీలక చర్చ

Update: 2021-08-01 03:43 GMT

సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ(ఫైల్ ఫోటో)

TS Cabinet Meeting: ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక, దళిత బంధుపై చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టులు, ఖాళీల లెక్కలకు మంత్రి వర్గం ఆమోదం తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈనెల చివరి నాటికి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

దళిత బంధు పథకం విధివిధానాలు ఖరారు చేయనుంది కేబినెట్ మరోవైపు దళిత బీమా పై విస్తృతంగా చర్చించనున్నారు. హుజూరాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఉత్తర్వులు వెలవడే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయ మార్గాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించున్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్దుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ పై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News