Etela Rajender: ఒక కార్యకర్తగా నా బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తా..

Etela Rajender: కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు

Update: 2023-07-04 11:32 GMT

తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌

Etela Rajender: తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను బీజేపీ హైకమాండ్‌ నియమించింది. ఇక.. బీజేపీ అధిష్టానం తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపారు ఈటల. తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసినవాడినని, కేసీఆర్‌ బలం, బలహీనతలు తనకు తెలుసని చెప్పారు.

ఒక కార్యకర్తగా తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు ఈటల. అలాగే.. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకంపై హర్షం వ్యక్తం చేశారు ఈటల. కిషన్‌రెడ్డి సీనియర్‌ నాయకులని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. కిషన్‌రెడ్డితో కలిసి పనిచేస్తామని చెప్పారు ఈటల రాజేందర్‌.

Tags:    

Similar News