Bhagwantmann Singh: ఇరిగేషన్ విషయంలో తెలంగాణ మోడల్‌గా నిలిచింది
Bhagwantmann Singh: తెలంగాణలాగే పంజాబ్‌లోనూ అన్ని వనరులు ఉన్నాయి
Bhagwantmann Singh: ఇరిగేషన్ విషయంలో తెలంగాణ మోడల్‌గా నిలిచింది
Bhagwantmann Singh: తెలంగాణతో పాటు పంజాబ్ లోనూ అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టుతో పాటు పంప్ హౌస్, ఎర్రవెల్లి వద్ద చెక్ డ్యాంలను పంజాబ్ సీఎం సందర్శించారు. నీటి పారుదలలో తెలంగాణ మోడల్‌గా నిలిచిందన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందన్నారు. పంజాబ్ లో ఇరిగేషన్ సిస్టమ్ దేశ విభజనకు ముందు ఏర్పాటు చేసిందని పెద్ద డ్యాంలు ఉన్నా చెరువులు లేక సమస్య ఏర్పడిందన్నారు. పంజాబ్ లో గ్రౌండ్ వాటర్ తక్కువ అని, నూతన ఒరవడి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.