KRMB Meeting Today: జలసౌధలో ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం
KRMB Meeting Today: బోర్డు పరిధిలోకి తెలంగాణ 7 ప్రాజెక్ట్‌లు, ఏపీలోని 22 ప్రాజెక్టులు...
KRMB Meeting Today: జలసౌధలో ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం
KRMB Meeting Today: జలసౌధలో ఇవాళ కేఆర్ఎంబీ సమావేశంకానుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డు ప్రత్యేకంగా సమావేశంకానుంది. కృష్ణ బేసిన్‌లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్‌లు, ఏపీలోని 22 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. జల విద్యుత్‌ను గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణపై విద్యుత్ పంప్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి ఇవ్వాలని ఏపీ కోరుతోంది.
తెలంగాణ విద్యుత్ పేరిట.. నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తుందంటోంది ఆంధ్రప్రదేశ్. కృష్ణపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలంటోంది ఏపీ. అయితే తెలంగాణ గెజిట్ అమలుకు కొంత సమయం కావాలని గతంలో కోరింది. ఈ ఇవాళ జరిగే సమావేశానికి బోర్డు ఛైర్మన్‌తో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు.