ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Gudem Mahipal Reddy: గూడెం మహిపాల్‌రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Gudem Mahipal Reddy: పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2014లో పటాన్‌చెరు సమీపంలోని ఒక ఫ్యాక్టరీపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఎమ్మె్ల్యే మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్దారిస్తూ స్థానిక కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై జిల్లా కోర్టు, తర్వాత తెలంగాణ హైకోర్టు స్టే కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
స్థానిక కోర్టు అన్ని విషయాలు పరిశీలించి, ట్రయల్‌లో వచ్చిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడిగా తేల్చినట్లు పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని, దోషిగా నిర్ధారిస్తూ... స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని పిటిషనర్ ఎంఏ ముఖీమ్ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.