Srisailam: శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam: జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ఐదురోజుల పాటు స్పర్శదర్శనం
Srisailam: శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలిపివేయనున్న ఆలయ అధికారులు స్పష‌్టం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు 1వ తేదీ నుచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం కోసం ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్ సౌకర్యం కల్పించారు.