Sravana Sukravaram: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ
* మంగళగౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి పూజలు * పిండి వంటలు, పండ్లతో నైవేధ్యం * చామంతులు, బంతిపువ్వులతో ప్రత్యేక పూజలు
వరలక్ష్మి వ్రతం (ఫోటో: ది హన్స్ ఇండియా)
Sravana Sukravaram: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావిస్తారు. మంగళగౌరి దేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. తొమ్మిది రకాల పిండి వంటలతో పాటు పండ్లను నైవేధ్యంగా చెల్లిస్తారు. అమ్మవారికి చామంతులు, బంతి పువ్వులు వ్రతంలో సమర్పిస్తారు. ముత్తయిదువులు అంతా కలిసి, ఇళ్లల్లోనే ఈ వ్రతాన్ని చేస్తారు. కొందరు సమీపంలోని అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి వ్రతాన్ని ఆచరిస్తారు.