Nirmal: నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. వేల సంఖ్యలో పాడైన లడ్డూలు

Nirmal: సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్‌

Update: 2023-10-23 11:19 GMT

Nirmal: నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. వేల సంఖ్యలో పాడైన లడ్డూలు

Nirmal: నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలపై ఫంగస్‌ కనిపించడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంగస్‌తో వేల సంఖ్యలో లడ్డూలు పాడవగా.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలు కాగా.. సిబ్బంది నిర్వాకంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News