బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి..!
* మర్రి శశిధర్రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రూమర్స్
మర్రి శశిధర్రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు
Marri Shashidhar Reddy Party Change: మర్రి శశిధర్రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. మర్రి శశిధర్రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రూమర్స్ రాగా ఆయన వివరణ ఇచ్చారు. ఢిల్లీకి రావడం కొత్త కాదన్నారు. తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. రాజకీయాల్లోనే ఉన్నానని ఇంకా రిటైర్డ్ కాలేదన్నారు. ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని బీజేపీలో చేరేందుకే వచ్చాననడం వాస్తవం కాదని మర్రి శశిధర్రెడ్డి స్పష్టం చేశారు.