Vikarabad: ఆకాశం నుంచి కింద పడిన వింత వస్తువు.. 'ఆదిత్య 369' తరహాలో..
Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం ఆకాశం నుండి పడింది.
Vikarabad: ఆకాశం నుంచి కింద పడిన వింత వస్తువు.. ‘ఆదిత్య 369’ తరహాలో..
Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం ఆకాశం నుండి పడింది. చూడటానికి ఆదిత్య 369సినిమాలో మాదిరిగా గుండ్రంగా ఉందంటూ ప్రచారం సాగుతుండటంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ పరికరానికి చుట్టు కెమరాలతో ప్యారచూట్‌ను పోలి ఉంది. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలనికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ వింత ఆకారాన్ని తమ ఫోన్ కెమెరాలలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. క్షణాల్లోనే ఆ వింతవుకు సంబంధించిన వార్త వైరల్ అవడంతో సైంటిస్టులు స్పందించారు. ఈ వింత వస్తువుపై క్లారిటీ ఇచ్చారు. అది ఒక బెలూన్ అని ప్రకటించారు. వాతావరణాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే భారీ హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు సైంటిస్టులు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.