Solar Power Weeder inveted by Private Teacher: ఈ యంత్రంలో పత్తి రైతుల కష్టాలు మాయం..

Solar Power Weeder inveted by Private Teacher: కరోనా సెలవుల్లో ఏం చేయాలో తెలియక చాలా మంది ఖాళీగా ఉంటూ టైం పాస్ చేస్తూ, టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు.

Update: 2020-07-05 07:54 GMT

Solar Power Weeder inveted by Private Teacher: కరోనా సెలవుల్లో ఏం చేయాలో తెలియక చాలా మంది ఖాళీగా ఉంటూ టైం పాస్ చేస్తూ, టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కరోనా సెలవుల్ని వృద్దా చేయకుండా ఉపయోగరమైన ఓ యంత్రాన్ని కనిపెట్టాడు. ఆ యంత్రాన్ని పత్తి పంటలో వచ్చే కలుపుమొక్కలని అతి సులువుగా తీసే విధంగా తీర్చిదిద్దాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఇది వరకు ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఉద్యోగం నచ్చని అతను 2003లో ఆ ఉద్యోగాన్ని వదిలి తన స్వగ్రామానికి వచ్చేసాడు. పిల్లలకు చదువు చెప్పాలనే కోరికతో 17 మంది విద్యార్థులతో ఒక ప్రైవేట్‌ పాఠశాల (స్లేట్‌ హైస్కూల్‌)ను జన్నారంలో ప్రారంభించారు. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరుగుతూ బాగా నడుస్తుంది. కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరించడంతో పాఠశాల మూసివేశారు. దీంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం మొదలు పెట్టారు.

ఆ రెండెకరాల్లో పత్తి పంటను వేసాడు. కానీ అందులో కలుపు బాగా మొలవడంతో కూలీలకు డిమాండ్ ఉండడంతో ఓ ఆలోచన చేసాడు. తానే ఓ కలుపు తీత యంత్రాన్ని కనిపెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. వెంటనే తక్కువ ఖర్చులో కలుపుతీసే యంత్రం తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ యంత్రం చేయడానికి చిన్న పిల్లల బ్యాటరీ కారులోని 12 వోల్ట్స్‌, 40 వాట్స్‌, 2500 ఆర్‌ఫీఎం గల రెండు మోటర్లు, సైకిల్‌ బేరింగ్‌, చైన్‌ను వాడారు. అంతే కాదు దానికి ఉన్న బ్యాటరీతో పాటు అదనంగా కూడా ఓ బ్యాటరీ ఏర్పాటు చేశారు. లోడ్‌ కంట్రోల్‌ చేయడం కోసం ఒక స్విచ్‌ ను, వోల్ట్‌ మీటర్‌(బ్యాటరీ డిశ్చార్జీ తెలుసుకునేందుకు) కూడా ఏర్పాటు చేసాడు. దాని బ్యాటరీ చార్జింగ్‌ కోసం సోలార్‌ ప్యానల్‌ వాడారు. దీంతో ఆ యంత్రం సక్సెస్ ఫుల్ గా తయారయింది. ఇక ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జీ చేస్తే చాలు సుమారుగా ఆరు గంటల వరకు పనిచేస్తుందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఆరుగంటల్లో ఎకరం కలుపు తీయవచ్చనీ, యంత్రానికి కేవలం రూ.4 వేలు మాత్రమే ఖర్చయ్యిందని ఆయన చెప్పారు. కొత్త పరికరాలను ఉపయోగించి యంత్రం తయారు చేస్తే సుమారు రూ.12 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని శ్రీకాంత్‌రెడి తెలిపారు.

Tags:    

Similar News