Telangana: బెల్లంపల్లి నియోజకవర్గలో యథేచ్ఛగా మట్టి దందా

Telangana: బెల్లంపల్లి నియోజకవర్గలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి దందాకు తెరతీశారు.

Update: 2021-03-13 09:17 GMT

ఫైల్ ఇమేజ్

Telangana: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధి ప్రాంతాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు లోడ్ చేసి మట్టిని దర్జాగా పట్టుకెళ్తున్నారు. అక్రమ దందాను అరికట్టాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలువస్తున్నాయి.

రైతుల భూముల్లో తవ్వకాలు...

బెల్లంపల్లి చుట్టుపక్క ప్రాంతాల్లో నీటి కుంటలు చెరువుల ఆవరణలో మట్టి తవ్వకాలు చేపడుతు న్నారు. తాండూర్ మండలంలో ఇదే తీరుగా మట్టి వ్యాపారం సాగుతోంది. రైతుల భూముల నుంచి తవ్వకాలు చేస్తున్నారు. ఇందుకు కొందరికి ప్రతిఫలం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమాయక రైతులకు ఎగనామం పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మట్టి తీసిన గుంతల్లో నీరు చేరి...

బెల్లంపల్లి నియోజకవర్గoలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, వేమనపల్లి మండలాలతో పాటు బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల నుంచి చెరువు, కుంటల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరి గోడను ఆనుకొని సుమారు 15 మీటర్ల లోతు నుండి మట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో ఆసుపత్రి బేస్మెంట్‌తో సహా బయటపడింది వర్షాకాలం ఈ మట్టి తీసిన గుంతల్లోనీరు చేరితే ఆస్పత్రి గోడలు కుంగిపోయి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తు వదిలి.. విలువైన మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News