Snake: వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో నాగుపాము కలకలం
Snake: బుసలు కొడుతూ దడపుట్టించిన పాము
Snake: వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో నాగుపాము కలకలం
Snake: వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాగుపాము తీవ్ర కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో పోలీస్ ఎస్కార్ట్ టీంకు నాగు పాము కనిపించింది. దీంతో అక్కడి సిబ్బంది ఎంత వెతికినా పాము కన్పించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ నాగుపాము బుసలు కొడుతూ కన్పించింది. విషయాన్ని స్నేక్ క్యాచర్‌కు చెప్పడంతో..స్నేక్ క్యాచర్ కృష్ణసాగర్ దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. నాగుపాము బుసలు కొడుతూ అటు ఇటు మనుషుల మీదకు వస్తుండడంతో సిబ్బంది అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే చివరకు స్నేక్ క్యాచర్ దానిని పట్టుకొని అడవిలో వదిలేయడంతో కలెక్టరేట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.