Hyderabad: పంజాగుట్టలో వైఎస్ షర్మిల అనుచరుల ఆందోళన
Hyderabad: వైఎస్సార్ విగ్రహం ఎదుట బైఠాయింపు * ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై ఆగ్రహం
వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహం దగ్గర వైఎస్ షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనను ఖండిస్తూ ధర్నా చేపట్టారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు ఏర్పాటు చేసే అభిమానులు వైఎస్ సొంతమని చెప్పారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.