Shamshabad: తొండపల్లిలో గుప్తనిధుల కలకలం..
Shamshabad: స్థానికుల సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు
Shamshabad: తొండపల్లిలో గుప్తనిధుల కలకలం..
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయడం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో తవ్వకాలు చేశారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి అక్కడే, టెంకాయలు, నిమ్మకాయలు, అగర్‌బత్తులు పెట్టి పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తవ్వకాలపై విచారణ చేపట్టారు. అక్కడికి కొద్ది దూరంలోనే మరో సొరంగం తవ్వి అందులో ఏదో వేసి దానిపై మట్టితో పూడ్చి, అనంతరం అగర్‌బత్తులతో పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.