Serial Killer: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్..
Serial Killer: మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని హర్యానాలోని రోహ్ తక్ జిల్లాకు చెందిన 29ఏళ్ల డ్రైవర్ రాహుల్ అలియాస్ భోలుగా గుర్తించారు. నవంబర్ 23, 2024న బెళగావి-మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళా ప్రయాణికురాలిని దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన రమణమ్మ (46) అనే బాధితురాలు హైదరాబాద్‌లోని తన కుమార్తెను చూడటానికి తోర్నగల్లు రైల్వే స్టేషన్ నుండి రైలు ఎక్కింది. పొరపాటున మహిళల కోచ్‌కి బదులుగా వికలాంగులైన ప్రయాణీకుల కోసం కేటాయించిన కోచ్‌లోకి ఎక్కింది.
రాత్రి 8 గంటల ప్రాంతంలో, రాహుల్ బళ్లారిలో కోచ్ ఎక్కాడు. ఇది వికలాంగుల కంపార్ట్ మెంట్ అని అతని ప్రశ్నించింది రమణమ్మ. పొరపాటున ఎక్కానంటూ..తర్వాత స్టేషన్ లో దిగుతానని చెప్పాడు. డోర్ దగ్గర నిల్చుండి సిగరేట్ తాగుతుండగా..బాధితురాలు సిగరేట్ తాగకూడదని హెచ్చరించింది. లేదంటే కోచ్ కు కంప్లైయింట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రాహుల్..ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని ఆమెను అక్కడికక్కడే గొంతునులిమి చంపాడు. ఆ తర్వాత బాధితురాలు దగ్గర ఉన్న రూ. 25వేల నగదును దోచుకుని తప్పించుకున్నాడు. చివరికి అతన్ని పార్డి పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో రమణమ్మను హత్యచేసినట్లు అంగీకరించడమే కాకుండా మరో నాలుగు హత్యలు, లైంగిక వేధింపులు కూడా చేసినట్లు అంగీకరించాడు.
2024 అక్టోబర్‌లో పూణే-కన్యాకుమారి రైలులో ఒక మహిళా ప్రయాణికురాలు హత్య, వారం తర్వాత హుస్నూర్-మంగళూరు రైలులో ఒక వృద్ధ ప్రయాణికురాలు గొంతు కోసి చంపడం, గుజరాత్‌లో ఒక యువతిపై హత్య, అత్యాచారం, 2024 నవంబర్‌లో కతిహార్-హౌరా రైలులో మరొక వృద్ధ ప్రయాణికురాలు హత్య చేసినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.