Jagannath Yatra: సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు
Jagannath Yatra: 130 ఏండ్ల నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్న రథయాత్ర
సికింద్రాబాద్ జగన్నాథ యాత్ర రద్దు (ఫైల్ ఇమేజ్)
Jagannath Yatra: సికింద్రాబాద్‌లో జులై 12న నిర్వహించే జగన్నాథ రథయాత్రను రద్దు చేస్తున్నట్లు శ్రీ జగన్నాథస్వామి రామ్‌గోపాల్ ట్రస్టు ప్రకటించింది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా రథయాత్రను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రథయాత్ర రద్దు కావడం వరుసగా ఇది రెండోసారి. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో 130 ఏండ్ల నుంచి క్రమం తప్పకుండా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగానే రథయాత్రను రద్దు చేశామని, భక్తులంతా తమ నివాసాల్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.