Hyderabad: వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Hyderabad: వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad: వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Hyderabad: వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఇచ్చిన ఉత్తర్వులే అమలులో ఉంటాయని తెలిపింది. POP విగ్రహాలను కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. గతంలో POP విగ్రహాలపై నిషేదం ఎత్తివేయాలని విగ్రహ తయారీదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. POP విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.