Sama Rangareddy: రాజకీయ లబ్ధి కోసమే సుధీర్ రెడ్డి హామీలు ఇస్తున్నారు
Sama Rangareddy: గత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అమలు చేయలేదు
Sama Rangareddy: రాజకీయ లబ్ధి కోసమే సుధీర్ రెడ్డి హామీలు ఇస్తున్నారు
Sama Rangareddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపి అభ్యర్థి సామ రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫతుళ్ళ గూడలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి, గతంలో ఇచ్చిన హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఫతుళ్ళగూడలో 9 వందల మంది ఇళ్ళ పట్టాలు రాని బాధితులు ఉంటే, ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన వారికే పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే సుధీర్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తే పట్టాలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.